![](http://www.sangeetasudha.org/ramadasu/ramadasu.jpg)
1. శ్రీ రామచంద్రుని సేవించినను చాలు
ప.. శ్రీరామచంద్రుని సేవించినను చాలు
శాశ్వతానందమును శాంతియును కలుగు
1. భరతుడే సేవించె పాదుకలనే కొలిచి
లక్ష్మణుడు సేవించె నిద్ర హారము మాని
గుహుడు సేవించెను పాదములు స్పృసియించి
శబరి సేవించెను మధుర ఫలముల నొసగి
2. మారుతి సేవించె మనసు రంజిల్లగా
వాల్మీకి సేవించె రామ రామ యనుచు
గోపన్న సేవించి గోపురములే కట్టె
త్యాగయ్య సేవించి మధుర గానముచేసె
3. శ్రీ రామ సేవకులుయెందరెందరో గలరు సేవ లెన్నయొ చేసి తరియించినారు
శ్రీ రామ సేవనము సంతోష భరితము
ముచ్చట గొలుపునది ముక్తి దాయకమిది
శ్రీ రామ సేవనము సంతోష భరితము
ముచ్చట గొలుపునది ముక్తి దాయకమిది
రచన: కొడవంటి సుబ్రహ్మణ్యం 02012010 smkodav@gmail.com
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి