30, డిసెంబర్ 2009, బుధవారం

3.శ్రీ రామ నామమెంత గొప్పదో





      ఆనంద భైరవి రాగము - ఆది తాళము
ప.. రామ నామమెంత గొప్పదో శ్రీ
      రామ మహిమమెంత గొప్పదో శ్రీ 
 1.  రాముడే దేముడంట  రక్షించెడి వాడంట
      రామ బాణమంటేనే తిరుగులేనిదంట
      రామ రామ అంటేనే వెతలన్నీ తీరునంట
      రామ భజనమే శ్రీ రామరక్ష యంట శ్రీ
 2.   రామరామఅంటూనే వుండునది ఎవరంట
      రామదేవు పాదాలే ప్రాణప్రదమెవరికంట
      రాముని సేవయే రమ్యమైనదెవరికంట
      రామబంటు అతడంట వీరాంజనేయుడంట
3.   వీరాంజనేయుడంట సంద్రము లంఘించెనంట
      వారిజాక్షి జానకికి శోకము వారించెనంట
      వీరాధి వీరులను అవలీలగ గూల్చెనంట
      విర్రవీగు రావణుని గర్వమణచి వేసెనంట
4.   లంకలోన హనుమంతుని వాలమునుగాల్చిరంట
      లంకనే గాల్చెనంట తన వాలముతో నంట
      లంకలోని వారినెల్ల శోకమందు ముంచెనంట 
     లంకనే దహియించి శ్రీ రాముని చేరెనంట 
          రచనకొడవంటి సుబ్రహ్మణ్యం
smkodav@gmail.com 
పాట వినండి:
 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

నా గురించి