2, జనవరి 2010, శనివారం

1.శ్రీ రామచంద్రుని సేవించినను చాలు .









1. శ్రీ రామచంద్రుని సేవించినను చాలు

ప.. శ్రీరామచంద్రుని సేవించినను చాలు
      శాశ్వతానందమును శాంతియును కలుగు
1.  భరతుడే సేవించె పాదుకలనే కొలిచి
     లక్ష్మణుడు సేవించె నిద్ర హారము మాని
    గుహుడు సేవించెను పాదములు స్పృసియించి
    శబరి సేవించెను మధుర ఫలముల నొసగి
2. మారుతి సేవించె మనసు రంజిల్లగా
    వాల్మీకి సేవించె రామ రామ యనుచు
    గోపన్న సేవించి గోపురములే కట్టె
    త్యాగయ్య సేవించి మధుర గానముచేసె
3.  శ్రీ రామ సేవకులుయెందరెందరో గలరు 
     సేవ లెన్నయొ చేసి తరియించినారు
    శ్రీ రామ సేవనము సంతోష భరితము
    ముచ్చట గొలుపునది ముక్తి దాయకమిది
     రచన: కొడవంటి సుబ్రహ్మణ్యం   02012010 smkodav@gmail.com

1, జనవరి 2010, శుక్రవారం

2. రామ రామ యనవె ఓ రామ చిలుక

2. రామ రామ యనవె ఓ రామ చిలుక
   రామ రామ యనవె ఓ రామ చిలుక
        నీ నోట వే వేల వరహాలు వొలక


1.  వరహాల మూటలను వరుసగా గొనిపోయి             
     భద్రాద్రి నంతటను బంగారు చేదాము 
     నీ సంతతి చేత నిత్యము పలికించు 
     సత్య వ్రతుండైన శ్రీ రామ నామాలు


2.  రవ్వల పేరుల మువ్వల కడియాల  
     పచ్చలు కెంపులు పొదిగిన హారముల  
     వన్నెలే దిద్దుదము వైభవముగా మనము  
     వాడ వాడల నున్న రామ మందిరమ్ములకు


3.  శ్రీ రామ మందిరము లేదని ఎవరనిన  
     శీఘ్రమే మందిరము నిర్మించి వేతాము  
     సీతా సమేతుడై శ్రీ రాముడే వెలయ
        ఆంజనేయుడు వారి నమిత భక్తితొ కొలువ 
              రచన : కొడవంటి సుబ్రహ్మణ్యం
                      smkodav@gmail.com
పాట  వినండి ఈ క్రింది సైటులో: 

30, డిసెంబర్ 2009, బుధవారం

3.శ్రీ రామ నామమెంత గొప్పదో





      ఆనంద భైరవి రాగము - ఆది తాళము
ప.. రామ నామమెంత గొప్పదో శ్రీ
      రామ మహిమమెంత గొప్పదో శ్రీ 
 1.  రాముడే దేముడంట  రక్షించెడి వాడంట
      రామ బాణమంటేనే తిరుగులేనిదంట
      రామ రామ అంటేనే వెతలన్నీ తీరునంట
      రామ భజనమే శ్రీ రామరక్ష యంట శ్రీ
 2.   రామరామఅంటూనే వుండునది ఎవరంట
      రామదేవు పాదాలే ప్రాణప్రదమెవరికంట
      రాముని సేవయే రమ్యమైనదెవరికంట
      రామబంటు అతడంట వీరాంజనేయుడంట
3.   వీరాంజనేయుడంట సంద్రము లంఘించెనంట
      వారిజాక్షి జానకికి శోకము వారించెనంట
      వీరాధి వీరులను అవలీలగ గూల్చెనంట
      విర్రవీగు రావణుని గర్వమణచి వేసెనంట
4.   లంకలోన హనుమంతుని వాలమునుగాల్చిరంట
      లంకనే గాల్చెనంట తన వాలముతో నంట
      లంకలోని వారినెల్ల శోకమందు ముంచెనంట 
     లంకనే దహియించి శ్రీ రాముని చేరెనంట 
          రచనకొడవంటి సుబ్రహ్మణ్యం
smkodav@gmail.com 
పాట వినండి:
 

29, డిసెంబర్ 2009, మంగళవారం

4. శ్రీ రాముడే నా రాముడు శ్రీ రాముడు నా రాముడు


4.శ్రీ రాముడే నా రాముడు శ్రీ రాముడు నా రాముడు


పల్లవి .. శ్రీ రాముడే నా రాముడు
శ్రీ రాముడు నా  రాముడు
శ్రీ రాముడూ నా రాముడు

1. దశరధునకు గారాల తనయుడు

మౌని యాగమును గాచిన ఘనుడు
శివ ధనువును అవలీలగ ద్రుంచి

సీతా దేవిని పరిణయమాడిన

2. కైక మాటలకు కినుక వహింపక

కాంత జానకితొ కానల కేగి
పాదుకలను భరతునకొసగి

పాదపూజలు అందుకొనిన

3. రావణుడంతట రమణి జానకిని

ఆపహరించెనని ఆర్తిని చెంది
సతిఎడబాటును సహించ నేరక

సహనశీలియై సతమతమైన

4. హనుమ సహాయము జానకి జాడయు 

చూడామణితో సంతసమంది
అనుజు లక్ష్మణుని అంజని సుతుని 

ఆప్యాయతతో అక్కున జేర్చిన

5. వానర బలముతొ వారధి దాటి

లంకను చేరి రణమును సలిపి
రావణు దునిమి రమణిని చేరి

రామరాజ్యముగ అయోధ్యనేలిన
 

రచన : కొడవంటి సుబ్రహ్మణ్యం--   smkodav@gmail.com

పాటను వినండి ఈ క్రింది సైటులో: 

5. శ్రీ సీతారామ కళ్యాణం

5. శ్రీ సీతారామ కళ్యాణం

















          ఆరభి రాగము         ఆదితాళము

పల్లవి.....శ్రీ రాముడు శివ ధనువు నెక్కిడ

 
            జానకి హృదయము ఝల్లుమనె

 
      1.   ఫె
ళ ఫెళ మనెను పెను రవమయ్యె

          మిధిలా నగరము మోదమునందె                   

            జనకుడానంద పరవసుడయ్యె


 

          విశ్వామిత్రుడు ప్రసన్నుడయ్యె
     


     2.    దశరధుడెంతయొ సంతసించెను

 
            అయోధ్య పొంగెను హర్షము తోడ


 
            జానకి రాముల పరిణయమాయెను


 
            జగము పులకించె జయము జయమ్మని





                                                                 రచన: కొడవంటి


పాట వినండి:
1. http://www.youtube.com/watch?v=lBcZbZ1tpTE




6. పాహి రామచంద్రప్రభో


 

 

 

6. పాహి రామచంద్రప్రభో:

                       ఆరభి రాగము                    త్రిశ్రనడ

పల్లవి..పాహి రామచంద్రప్రభో పలుకవేమిరా
        కనికరించి నాదరికి కదలిరావదేలరా

1.  నిరతము నీ నామమునే  

    మదిని తలచు చుంటినిరా
    నీవే నా దైవమ్మని నిన్ను 

    కొలచు చుంటినిరా
    సత్యవ్రతుడవు నీవని  

    సకలము నీ కెరుకయని
    హితులకు సన్నిహితులకు 

    హితము కలుగ  జేయుచుంటి
 

2. అడుగులకే మడుగులొత్తు 
   అనుజుండే లక్ష్మణుండు
   అహరహమును ప్రీతితోడ 

   పులకరించు హనుమన్న
   సాధ్వి సీత సపర్యలు 

   సమ్మోహన పరచుచుండు
   సకల జనుల సన్నుతుడవు 

   యేమని నుతియింతునురా

రచన : కొడవంటి సుబ్రహ్మణ్యం-

smkodav@gmail.com

26, డిసెంబర్ 2009, శనివారం

7. సీతా మాతను జూచితి రామా




 7. సీతా మాతను జూచితి రామా
పల్లవి..... సీతా మాతను జూచితి రామా
               శ్రీ రఘు రామా శ్రీ రామా
      1.     లంక యంతయును వెదకితి రామా - అశోక వనమున గాంచితి రామా 
              శోకము నందెను జానకి రామా - రావణు బారిన పడినది రామా
              నీవే దిక్కని నమ్మెను రామా - నిత్యము నిన్నే కొలచును  రామా 
              నీ ముద్రికనే యిచ్చితి రామా - చూడామణి నే తెచ్చితి రామా 
    2.      రాక్షస బలమును గాంచితి రామా - రాక్షసులను బరిమార్చితి రామా 
             రావణ సుతుడే వచ్చెను రామా - అక్షకునే హతమార్చితి రామా
             బ్రహ్మాస్త్రమునకు లొంగితి రామా - రావణు కొలువు జొచ్చితి రామా 
             రావణు గర్వము జూచితి రామా  - రాముడె శరణనమంటిని రామా 
    3.      విషయమంత వినిపించితి రామా - విరోధమ్ము వలదంటిని రామా 
             సీతను నీ చెంతకు రామా - శీఘ్రమే చేర్చమనంటిని రామా 
             విషపు నవ్వునే నవ్వెను రామా - విరోధినని దూషించెను రామా 
   4.      నన్ను చంపగా నెంచిరి రామా - విభీషణుండె వలదనె రామా 
             వాలమునకు వల పన్నిరి రామా - చీరల నెన్నియొ చుట్టిరి రామా 
             వారు రగిల్చిన అగ్నితొ రామా - లంకా దహనము చేసితి రామా 
             సీత క్షేమము చూసితి రామా - శీఘ్రమే నీ దరి చేరితి రామా  
   రచన : కొడవంటి సుబ్రహ్మణ్యం 

8. రామాయణమునకే రమ్యమగు కాండ



 8. రామాయణమునకే రమ్యమగు కాండ
 పల్లవి....రామాయణమునకే రమ్యమగు కాండ
            సుందరమ్మగు కాండ సుందరా కాండ
   1.    సీతా మహా సాధ్వి శాంతినొందిన కాండ
          రామ దేవుని మది రంజిల్లిన కాండ
          వీరాంజనేయుని విజ్రుమ్భణపు కాండ
          వానర శ్రేష్ఠునకు  వరమైన కాండ
    2.   రావణుని లంకలో రగడ జరిగిన కాండ
          రాక్షసుల గర్వము భంగ పరచిన కాండ
          రక్కసి మూకలను రచ్చకీడ్చిన కాండ
          దశకంఠునకు దడ పుట్టిన కాండ
   3.    అక్షయ కుమారుని హతమార్చిన కాండ
          అంజని సుతునకు అత్యద్భుతపు  కాండ
          మారుతికి తన బలము తెలిసిన కాండ
          లంకా దహనమ్ము జరిగిన కాండ
   4.    వాలముతోడ లంకాదహనము - వరమని తలచెను వాయు తనయుడు
          అగ్ని దేవుడే అనుగ్రహించెను - ఆశీర్వాదము పొందెను హనుమ
          ఆహుతి చేయుట కుపక్రమించెను - లంకా రాజ్యమే ఆహుతి ఆయెను
          సంపద అంతయు సమూలమ్ముగా - దగ్ధమా
యెను ధనగారములు
          అగ్ని జ్వాలలే ఆకసమంటెను - అగ్ని దేవునకు ఆకలి తీరెను
          అశోక వనమును హనుమ దర్శించే - హరిత వనమ్మై హాయిని గొలిపె
   5.    రామునకు హనుమన్న ఆప్తుడైన కాండ
          మైత్రీ బంధమున మహిమాన్వితపు కాండ  
          మరుతాత్మజునకు మరపు రాని కాండ
          ఆలింగనముతోడ హాయి గొలిపిన కాండ

                      రచన: కొడవంటి సుబ్రహ్మణ్యం 


                  
      

8. రామాయణమునకే రమ్యమగు కాండ



 8. రామాయణమునకే రమ్యమగు కాండ
 పల్లవి....రామాయణమునకే రమ్యమగు కాండ
            సుందరమ్మగు కాండ సుందరా కాండ
   1.    సీతా మహా సాధ్వి శాంతినొందిన కాండ
          రామ దేవుని మది రంజిల్లిన కాండ
          వీరాంజనేయుని విజ్రుమ్భణపు కాండ
          వానర శ్రేష్ఠునకు  వరమైన కాండ
    2.   రావణుని లంకలో రగడ జరిగిన కాండ
          రాక్షసుల గర్వము భంగ పరచిన కాండ
          రక్కసి మూకలను రచ్చకీడ్చిన కాండ
          దశకంఠునకు దడ పుట్టిన కాండ
   3.    అక్షయ కుమారుని హతమార్చిన కాండ
          అంజని సుతునకు అత్యద్భుతపు  కాండ
          మారుతికి తన బలము తెలిసిన కాండ
          లంకా దహనమ్ము జరిగిన కాండ
   4.    వాలముతోడ లంకాదహనము - వరమని తలచెను వాయు తనయుడు
          అగ్ని దేవుడే అనుగ్రహించెను - ఆశీర్వాదము పొందెను హనుమ
          ఆహుతి చేయుట కుపక్రమించెను - లంకా రాజ్యమే ఆహుతి ఆయెను
          సంపద అంతయు సమూలమ్ముగా - దగ్ధమా
యెను ధనగారములు
          అగ్ని జ్వాలలే ఆకసమంటెను - అగ్ని దేవునకు ఆకలి తీరెను
          అశోక వనమును హనుమ దర్శించే - హరిత వనమ్మై హాయిని గొలిపె
   5.    రామునకు హనుమన్న ఆప్తుడైన కాండ
          మైత్రీ బంధమున మహిమాన్వితపు కాండ  
          మరుతాత్మజునకు మరపు రాని కాండ
          ఆలింగనముతోడ హాయి గొలిపిన కాండ

                      రచన: కొడవంటి సుబ్రహ్మణ్యం 





నా గురించి